ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి


Tue,May 15, 2018 01:03 AM

-సురాబయాలో 24 గంటల్లోపు మరోఘటన
-నలుగురు మృతి.. పది మందికి గాయాలు
-ఆత్మాహుతి దాడికి పాల్పడిన మరో కుటుంబం
సురాబయా: ఇండోనేషియాలోని సురాబయా నగరం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. 24 గంటల్లోపే మళ్లీ ఆత్మాహుతి దాడులతో భీతిల్లింది. సురాబయాలోని పోలీస్ ప్రధాన కార్యాల యం లక్ష్యంగా రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు తమను తాము పేల్చుకున్నారు. ఈ దాడిలో నలుగురు చనిపోగా, పోలీసులతో పాటు మొత్తం పది మంది గాయపడ్డారు. సోమవారం ఒకే కు టుంబానికి చెందిన ఐదుగురు రెండు ద్విక్రవాహనాలపై పోలీ స్ హెడ్‌క్వార్టర్ వద్దకు వచ్చారు. వారిలో ఒక చిన్నారి కూడా ఉ న్నారు. పోలీసులు తనిఖీలు చేస్తుండగా తమను తాము పేల్చుకొని ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు అని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో బయటపడ్డ ఎనిమిదేండ్ల చిన్నారిని దవాఖానకు తరలించి చికిత్స అందస్తున్నట్టు తెలిపారు.

286

More News

VIRAL NEWS