పాక్ సుప్రీంకోర్టులో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగం!

Thu,September 13, 2018 12:23 AM

Supreme Court of Pakistan to hire two transgenders

ఇస్లామాబాద్: తమ న్యాయస్థానంలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల (లింగమార్పిడి వ్యక్తులకు)కు ఉద్యోగాలిస్తామని పాకిస్థాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులపై ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సమాజంలో ట్రాన్స్‌జెండర్లను హేళన చేస్తాం. అది తగదు. వారి హక్కులు వారికి ఇవ్వడమే మా ప్రథమ ప్రాధాన్యం అని చెప్పారు. ఖైబర్-ఫఖ్తుంఖ్వా రాష్ట్ర పరిధిలో ట్రాన్స్‌జెండర్లు హేళనకు గురవుతున్నారని చీఫ్ జస్టిస్ సాఖిబ్ చెప్పారు.

303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles