ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి.. 26 మంది మృతి

Sun,June 17, 2018 12:34 AM

Suicide Bomber Attacks Gathering of Taliban and Afghan Forces

-మృతుల్లో తాలిబన్లే ఎక్కువ
-కాల్పుల విరమణను పొడిగించిన అష్రఫ్‌ఘని
జలాలాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ వ్యక్తి జరిపిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మృతిచెందారు. దాదాపు 54 మంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం నాన్‌గర్‌హర్ రాష్ట్రంలోని రోడాట్ జిల్లాలో జరిగింది. రంజాన్ పండుగ కారణంగా అమలవుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తాలిబన్లు, ఆఫ్ఘన్ భద్రతా బలగాలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటుండగా ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా తాలిబన్లు ఉన్నట్లు తెలుస్తున్నది. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. రంజాన్ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం, అటు తాలిబన్లు కాల్పుల విరమణను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ఘని ప్రకటించారు.

275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles