సూడాన్‌లో సైనిక తిరుగుబాటు

Fri,April 12, 2019 01:43 AM

-అధ్యక్షుడు బషీర్ తొలిగింపు.. సురక్షిత ప్రదేశానికి తరలింపు
-రెండేండ్ల పాటు మిలిటరీ పరివర్తన కౌన్సిల్ పాలిస్తుందన్న రక్షణ మంత్రి
-సరిహద్దులు, గగనతలం మూసివేతకు సూడాన్ నిర్ణయం

ఖార్టోమ్, ఏప్రిల్ 11: మూడు దశాబ్దాల క్రితం 1989లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బషీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెలల తరబడి ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుగుబాటు చేసిన సైన్యం గు రువారం ఒమర్ అల్ బషీర్‌ను దేశాధ్యక్షుడిగా తొలిగించింది. తర్వాత ఆయనను అ దుపులోకి తీసుకుని సురక్షిత ప్రదేశానికి తరలించింది. తర్వాత రక్షణ మంత్రి అవాద్ ఇబ్నౌప్ జాతినుద్దేశించి మాట్లాడుతూ ఉ ద్వాసనకు గురైన అధ్యక్షుడిని సురక్షిత ప్రదేశానికి తరలించామని, ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయిందని ప్రకటించారు.

దాని స్థానంలో రెండేండ్ల పాటు మిలిటరీ పరివర్తన మండలి అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు గగనతలాన్ని, దేశ సరిహద్దులను మూసివేసినట్లు ప్రకటించారు. ఉ ద్వాసనకు గురైన ఒమర్ అల్-బషీర్ యుద్ధ నేరాలకు, సామూహిక హత్యలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. గురువారం కీలక ప్రకటన చేస్తామని సైన్యం ప్రకటించడంతో సూడాన్ పౌరులు భారీగా వీధుల్లోకి దూసుకొచ్చారు. ప్రభుత్వం కూలిపోయిం ది అన్న నినాదాన్ని హోరెత్తించారు. గత డిసెంబర్‌లో బ్రెడ్ ధర మూడింతలు పెంచు తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు నిరసనకు దిగగా భారీగా అరెస్ట్‌లు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేస్తున్నట్టు సైన్యం ప్రకటించింది. అంతకుముందు గురువారం తెల్లవారుజాము నుంచే ఖార్టోమ్ నగరంలోని ప్ర ధాన కార్యాలయాల వద్ద భారీగా సైన్యా న్ని మోహరించారు. బషీర్‌కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఇస్లామిక్ మూవ్‌మెంట్ కార్యాలయాలపై సైన్యం దాడు లు నిర్వహించింది. మరోవైపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య కూడా ప్రజానీకం, సైనిక జవాన్లను హత్తుకుని అభినందించారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles