పాక్‌లో మహారాజా రంజిత్‌సింగ్‌ విగ్రహం ధ్వంసం

Mon,August 12, 2019 01:21 AM

Statue of Maharaja Ranjit Singh vandalised in Pakistan

లాహోర్‌: పాకిస్థాన్‌లోని లాహోర్‌ కోటలోని మహారాజా రంజిత్‌ సింగ్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. 19వ శతాబ్ది ప్రారంభంలో పాక్‌లోని పంజాబ్‌ను దాదాపు 40 ఏండ్లు రంజిత్‌సింగ్‌ పాలించారు. ఆయన 180వ వర్ధంతి సందర్భంగా గత జూన్‌లో లాహోర్‌ కోటలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం నెలకొల్పారు. సిక్కు సామ్రాజ్య తొలి చక్రవర్తి అయిన ఆయన.. 1839లో మరణించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇద్దరు అనుమానితులను పాక్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. వారు తీవ్రవాద భావాలున్న మతాధికారి మౌలానా ఖాదిమ్‌ రిజ్వికి చెందిన తెహ్రీక్‌ లబ్బాక్‌ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. లాహోర్‌ కోట వ్యవహారాలను పర్యవేక్షించే ‘ది వాలెడ్‌ సిటీ ఆఫ్‌ లాహోర్‌ (డబ్ల్యూసీఎల్‌ఏ)’ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఈద్‌ ముగిసిన వెంటనే విగ్రహానికి మరమ్మతులు చేయిస్తామని తెలిపింది.

1098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles