రుధిర వర్ణంలో జాబిల్లి కనువిందు

Tue,January 22, 2019 02:13 AM

Stargazers share images of the super blood wolf moon

-ఒకేసారి సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌మూన్
ఫ్లోరిడా, జనవరి 21: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌మూన్ ఒకేసారి ఏర్పడి కనువిందు చేశాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఇదొక్కటే కావడం విశేషం. ఆదివారం రాత్రి చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖపైకి రావడంతో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణం సమయంలో చంద్రుడు భూమికి మరింత చేరువగా రావడంతో సాధారణంగా కనిపించే దాని కంటే జాబిల్లి మరింత పెద్దదిగా, ప్రకాశవంతంగా దర్శనమిచ్చింది. మూడు గంటల పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. భూ వాతావరణంలోని సూర్యరశ్మి ప్రభావంతో గ్రహణం సమయంలో జాబిల్లి ఎరుపు వర్ణంలో కనిపించింది. ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలతోపాటు అట్లాంటిక్, యూరప్‌లోని పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌మూన్ దర్శనమిచ్చాయి.

680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles