కూచిభొట్ల సునయనకు అరుదైన గౌరవం


Sat,January 13, 2018 01:26 AM

-స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగం
-కార్యక్రమంలో పాల్గొనాలని ఆమెరికా ఆహ్వానం

Sunayana-Dumala
వాషింగ్టన్, జనవరి 12: గతేడాది అమెరికాలోని కాన్సాస్‌లో జాతివివక్ష దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రవాస భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 30న అమెరికాలో జరుగనున్న స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగం కార్యక్రమంలో పాల్గొనాలని ఆమెకు ఆహ్వానం అందింది. కూచిభొట్ల మరణం తర్వాత సునయన అమెరికాలో తన పౌరసత్వాన్ని కోల్పోయారు. అయినప్పటికీ అమెరికాలో నివసించేందుకు అనుమతి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్గానికి చెందిన ప్రతినిధి కెవిస్ యోడర్ మాట్లాడుతూ భారతీయులతోపాటు ఇతర దేశాలకు చెందినవారిని ఆహ్వానించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సునయన మాట్లాడుతూ అమెరికాలోని తన స్నేహితులు, కుటుంబీకుల నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నదని పేర్కొన్నారు.

289

More News

VIRAL NEWS