కక్ష్యలోకి శ్రీలంక తొలి ఉపగ్రహం రావణ-1

Thu,June 20, 2019 01:03 AM

Sri Lanka successfully launches its first satellite Ravana 1 into orbit

కొలంబో: శ్రీలంకకు చెందిన మొట్టమొదటి ఉపగ్రహం రావణ-1 విజయవంతంగా కక్ష్యలో చేరింది. ఇద్దరు స్థానిక ఇంజినీర్లు అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహంతోపాటు జపాన్, నేపాల్‌లకు చెందిన రెండు బర్డ్స్ 3 ఉపగ్రహాలను అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి ఈ వారంలో ప్రయోగించారు. కేవలం 1.03 కిలోల బరువు గల క్యూబ్ (11.3 సెం.మీ x 10 సెం.మీ x 10 సెం.మీ) ఉపగ్రహాన్ని సోమవారం ప్రయోగించారని శ్రీలంక దినపత్రిక కొలంబో పేజ్ తెలిపింది. జపాన్ క్యూషు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్పేస్ ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న ఇద్దరు శ్రీలంక ఇంజినీర్లు థారిందు దయారత్నే, దులానీ చామికా ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసి ఫిబ్రవరి 18న జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థకు అప్పగించారు. అమెరికా అంతరిక్ష నౌక సైగ్నస్-1 సాయంతో ఐఎస్‌ఎస్‌కు చేర్చారు. శ్రీలంక, పరిసర ప్రాంతాల్లో పరిస్థితుల అధ్యయనం కోసం ప్రయోగించిన రావణ -1 ఉపగ్రహ జీవిత కాలం 18 నెలలే అయినప్పటికీ ఐదేండ్ల పాటు చురుగ్గా పని చేస్తుందని అంచనా.

334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles