దక్షిణ సూడాన్‌లో విమానం క్రాష్ ల్యాండింగ్

Tue,March 21, 2017 02:15 AM

plane
జుబా, మార్చి 20: దక్షిణ సూడాన్‌లోని వావ్ పట్టణంలో ఓ ప్రయాణికుల విమానాన్ని అత్యవసర స్థితిలో ల్యాండింగ్ చేశారు. విమానం రన్‌వేను చేరుకోగానే ఇంజిన్లు పేలిపోవడంతో విమానం మొత్తం మంటల్లో చిక్కుకున్నది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారని 14 మంది గాయాలతో బయటపడ్డారని, మిగతావారి పరిస్థితి తెలియరాలేదని ఆ దేశ సమాచార శాఖ మంత్రి బొనా గౌడెన్సియో తెలిపారు. రాజధాని జుబా నుంచి బయలుదేరిన విమానాన్ని వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో వావ్ పట్టణంలోని ఎయిర్‌పోర్ట్‌లో క్రాష్ ల్యాండింగ్ చేశారని చెప్పారు. ల్యాండింగ్ కాగానే పేలుళ్లు సంభవించాయని, విమానమంతా మంటల్లో చిక్కుకున్నదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

536

More News

మరిన్ని వార్తలు...