దక్షిణ కొరియాలో ముగిసిన కిమ్ సోదరి పర్యటన


Tue,February 13, 2018 01:19 AM

Kim-Yo-Jong
గ్యాంగ్‌వ్యాంగ్ (దక్షిణ కొరి యా) : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరి యా పర్యటన ముగిసింది. దక్షిణ కొరియాలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు వచ్చి న ఉత్తర కొరియా బృందానికి ఆమె నాయకత్వం వ హించారు. సోదరుడు కిమ్ జోంగ్ ఉన్‌కు చెందిన జెట్ విమానంలో మిగతా బృందసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ప్యాంగ్‌యాంగ్ చేరుకున్నారు. అంతకుముందు దక్షిణ కొరియా అధ్యక్ష భవనంలో తన గౌరవార్థం ఏర్పాటుచేసిన విందులో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో జోంగ్ చర్చలు జరిపారు. సంగీత కళాకారుల సంప్రదాయ నృత్యాలను మూన్ జేతో కలిసి వీక్షించారు. ఉత్తర కొరియాలో జరిగే సదస్సులో పాల్గొనాలని మూన్‌ను కిమ్ ఆహ్వానించడం విశేషం. విడిపోయి దశాబ్దాలు కావస్తున్నా రెండు దేశాల్లో కొన్నింటిలో ఎలాంటి మార్పు లేదని ఆమె అన్నారు.

174

More News

VIRAL NEWS