అమెరికాలో సిక్కు మతస్థుడి అరెస్టు


Mon,June 19, 2017 03:19 AM

Kirpan
-కిర్పాన్‌ను ధరించడమే కారణం
వాషింగ్టన్: కిర్పాన్‌ను ధరించినందుకు హర్‌ప్రీత్‌సింగ్ ఖల్సా అనే సిక్కు మతస్థుతుడిని అమెరికా పోలీసులు అ రెస్టు చేశారు. క్యాటన్స్‌విల్లేలోని ఒక దుకాణంలో అతని వెంట కిర్పాన్ ఉండ టం చూసి ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని ఆయనను అరెస్టు చేసి, తర్వాత విడుదల చేసిన ఘటన గత వారం చోటుచేసుకుంది. ఆ కత్తి కిర్పాన్. సిక్కు సంప్రదాయం ప్రకారం కిర్పాన్‌ను ధరిస్తారు. దీంతో సమాజానికి ఎటువంటి ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్న తరువాత ఖల్సాను విడుదల చేశాం అని బాల్టిమోర్ కంట్రీ పోలీసు అధికారి జెన్నిఫర్ పీచ్ తెలిపారు. ఖల్సా అసలు పేరు జస్టిన్ స్మిత్. ఇతను తొమ్మిదేండ్ల క్రితం సిక్కు మతాన్ని స్వీకరించాడు. కిర్పాన్‌ను మేము కత్తిగా పరిగణించం. న్యాయం కోసం పోరాడేందుకు సూచికగా దాన్ని భావిస్తాం. దాతృత్వం, ప్రేమ, మానవాళికి సేవ అనే ఆదర్శాల గురించి సిక్కుకు కిర్పాన్ బోధిస్తుంది అని న్యూయార్క్ సిక్కుల సంఘం న్యాయసేవల డైరెక్టర్ హర్‌సిమ్రన్ కౌర్ వివరించారు.

342

More News

VIRAL NEWS