నవాజ్ షరీఫ్‌పై బూటు విసిరిన విద్యార్థి


Mon,March 12, 2018 02:03 AM

-పాక్ విదేశాంగ మంత్రిపై ఇంకు దాడి
Nawza-Shariff
లాహోర్: పాకిస్థాన్‌లో త్వరలో జరిగే ఎన్నికల్లో మద్ద తు కోసం ప్రజల్లోకి వెళ్తున్న అధికార పీఎంఎల్ - ఎన్ పార్టీ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు ప్రభుత్వంపై గూడుకట్టుకొన్న కోపా న్ని వివిధ రూపాల్లో ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తా జాగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఓ యువకుడు బూటు విసరడం కలకలం సృష్టించింది. వేదికపై షరీఫ్ మాట్లాడుతుండగా ఆయనపైకి షూ దూసుకురావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. లాహోర్ స మీపంలో ఘరిసాహులోని జమియా నమీమియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయంలో ఆదివారం ఓ సెమినార్‌లో షరీఫ్ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తుండగా మాజీ విద్యార్థి ఈ దాడి చేశాడు. దీంతో షూ షరీఫ్ చెవి కి, భుజానికి తగిలింది. సదరు యువకుడు వేదికపైకి దూసుకొచ్చి నినాదాలివ్వడంతో అతడిని నిర్బంధించిన నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. వివాదం సద్దుమణిగాక షరీఫ్ ప్రసంగించారు. విదేశాంగమంత్రి ఖ్వాజా ఆసీఫ్ పైనా శనివారం ఇలాంటి దాడే జరిగింది. తన సొంత నియోజకవర్గం సియోల్‌కోట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఆయన ముఖంపై ఓ వ్యక్తి నల్లసిరా పూసి దాడి చేశాడు. ఇటీవల తన సొంత నియోజకవర్గం నరోవాల్‌లో అంతరంగికశాఖ మంత్రి అసాన్ ఇక్బాల్ మాట్లాడుతున్పుడు ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరాడు. దాడికి గురైన వారంతా అధికార పీఎంఎల్-ఎన్) పార్టీ వారు కావడం గమనార్హం.

816

More News

VIRAL NEWS