24వసారి ఎవరెస్ట్ అధిరోహణం!

Wed,May 22, 2019 01:37 AM

Sherpa guide Kami Rita climbs Mount Everest for 24th time extends own record

- వారం వ్యవధిలో తన రికార్డును తానే బద్దలుకొట్టిన నేపాలీ షెర్పా గైడ్
కాఠ్మాండూ, మే 21: ఎవరెస్ట్ పర్వతాన్ని 24వ సారి అధిరోహించి నేపాలీ షెర్పా గైడ్ కామి రీటా వారం వ్యవధిలోనే తన రికార్డును తానే బద్దలుకొట్టారు. ఈ నెల 15న 23వ సారి ఎవరెస్ట్‌ను ఎక్కి, ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. తాజాగా మంగళవారం భారత పోలీస్ బృందానికి గైడ్‌గా వ్యవహరించి 24వసారి అధిరోహించి రికార్డు బద్దలు కొట్టారు. 1994 నుంచి కామి రీటా ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్నారు.

447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles