వయస్సు ఏడేండ్లు.. ఆదాయం రూ.155 కోట్లు

Wed,December 5, 2018 02:38 AM

seven year old YouTuber who made 155 crore in a year

న్యూయార్క్: వయస్సు ఏడేండ్లు.. సంపాదన రూ.155 కోట్లు. మీరు చదివింది నిజమే. జీవితాంతం కష్టపడినా కోటీశ్వరులం కాలేకపోతున్నాం.. ఏడేండ్లకే ఈ బాలుడు ఎలా కోట్లు సంపాదించాడనేగా మీ సందేహం. అమెరికాకు చెందిన ఈ బాలుడి పేరు రియాన్. అతడు యూట్యూబ్‌లో రియాన్ టాయిస్ రివ్యూ పేరుతో వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. ఈ వీడియోలో కార్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు తదితర పరికరాలకు సంబంధించిన సమీక్షలు ఉంటాయి. ఈ చానెల్‌ను రియాన్ తన తల్లిదండ్రులతో కలిసి 2015లో ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ చానెల్‌కు 1.73 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఈ చానెల్ వచ్చిన వ్యూస్ 2,600 కోట్లు. దీంతో చానెల్‌కు ప్రకటనలు పెరిగిపోయాయి. ఏడాదిలో రూ.155 కోట్ల రాబడితో ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన హైయెస్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్ 2018 జాబితాలో రియాన్ మొదటిస్థానంలో నిలిచాడు.

1337
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles