ట్రంప్‌కు మరో షాక్‌!

Mon,October 7, 2019 03:14 AM

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌ తగిలింది. ఉక్రెయిన్‌ ఫోన్‌ కాల్‌ వివాదంపై కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు మరో అధికారి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ ప్రభుత్వేతర సంస్థకు చెందిన న్యాయవాది మార్క్‌ జేయిడ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ తరపున అభ్యర్ధిత్వం కోసం ప్రయత్నిస్తున్న జో బిడెన్‌, ఉక్రెయిన్‌లో గ్యాస్‌ సంస్థ నిర్వహిస్తున్న ఆయన కుమారుడి అవినీతి విషయంలో దర్యాప్తు వేగవంతం చేయాలని జూలై 25న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడిమర్‌ జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఫోన్‌ చేసి ఒత్తిడి తెచ్చినట్టు అమెరికా ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ అధికారి ఆరోపించారు. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పీకర్‌ నాన్సీ పెలోసి ప్రకటించారు.

413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles