సముద్రపు పాచి నుంచి ఆవిర్భవించాం!


Mon,December 4, 2017 02:47 AM

sponges
లండన్, డిసెంబర్ 3: సముద్రంలో ఉండే పాచి (స్పాంజి) మానవులతోపాటు, ఇతర జంతుజాతుల ఆవిర్భావానికి కారణమై ఉండొచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వృక్షాల నుంచి వేరుచేస్తూ.. జీర్ణక్రియ, నాడీవ్యవస్థ వంటి అవయవ వ్యవస్థలతో కూడిన జంతువులు ఆవిర్భవించడంలో ప్రస్తుతం రెండు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. సముద్రంలో ఉండే జెల్లీలు పరిణామం చెంది జంతుజాతులు విస్తరించాయని ఒక వర్గం శాస్త్రవేత్తలు చెప్తుంటే.. పాచి నుంచి పరిణామం చెందాయని మరో వర్గం వాదిస్తున్నది. తాజాగా బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సముద్రపు పాచి మన పూర్వీకులని స్పష్టం చేస్తున్నారు. రెండేండ్లపాటు పలు జంతు జాతుల జన్యుక్రమాన్ని అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. అవయవవ్యవస్థలను కలిగిఉన్న మొట్టమొదటి జీవుల నుంచే జంతు జాతులు ఆవిర్భవించాయి. ఈ విషయంలో స్పాంజి, జెల్లీ మధ్య కొనసాగుతున్న వివాదానికి మేం తెరదించాం. జన్యు విశ్లేషణ ద్వారా సముద్రపు పాచిని జంతుజాతుల పూర్వీకులుగా గుర్తించాం అని పరిశోధక బృంద సభ్యుడు డేవిడ్ పిసాని తెలిపారు. వీరి పరిశోధన వ్యాసం కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

702

More News

VIRAL NEWS