ఆ రంగు వయస్సు.. 110 కోట్ల ఏండ్లు

Wed,July 11, 2018 02:22 AM

Scientists find worlds oldest biological colours

-అత్యంత పురాతన వర్ణద్రవ్యాలను కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
-జీవపరిణామంపై కొత్త కోణాలను వెల్లడించిన పరిశోధన

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని సహారా ఎడారిలో అత్యంత పురాతన జీవ వర్ణద్రవ్యాలను (బయోలాజికల్ కలర్ పిగ్మెంట్)ను కనుగొన్నారు. సూక్ష్మజీవులు మృతిచెందిన తర్వాత శిలాజాలుగా మారే క్రమంలో వాటి శరీరంలోని పదార్థాలు రసాయన చర్యలకు గురై కొత్త రంగులోకి మారుతాయి. వీటినే జీవ వర్ణాలు అని పిలుస్తుంటారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూ నివర్సిటీ (ఏఎన్‌యూ) శాస్త్రవేత్తలు మౌరిటానియాలోని టౌడేని బేసిన్‌లో చాలా లోతుకు తవ్వకాలు జరిపినప్పుడు నల్లటి సము ద్ర నాపరాళ్లు (మెరైన్ బ్లాక్ షేల్స్) బయటపడ్డాయి. వీటిపై బ్రైట్ పింక్ రంగు ఆనవాళ్లు దొరికాయని, ఇవి 110 కోట్ల ఏండ్ల కిందటివిగా గుర్తించామని ఏఎన్‌యూ శాస్త్రవేత్త నుర్ గునెలి తెలిపారు. సైనో బ్యాక్టీరియాలో క్లోరోఫైలి అనే పదార్థం కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడుతుంది. అవి మృతి చెంది శిలాజాలుగా మారినప్పుడు క్లోరోఫైలి గులాబి వర్ణద్రవ్యంగా మారిం ది అని అన్నారు. ఈ పరిశోధన జీవపరిణామంపై కొత్త కోణాలను వెలుగులోకి తెచ్చిందన్నారు. భూమి 450 కోట్ల ఏండ్ల కిందట పుట్టింది. జీవం సముద్రంలో బ్యాక్టీరియా వంటి ఏకకణజీవుల రూపంలో ప్రారంభమైంది. పాచి లేదా శైవలాలు వంటి సూక్ష్మజీవులు భూమిపైకి అడుగు పెట్టి పరిణామం చెంది వృక్షాలు, జంతువులు వంటి సంక్లిష్ట జీవులుగా మారాయి. జీవం సముద్రం నుంచి భూమిపైకి రావడానికి పదుల కోట్ల ఏండ్లు పట్టింది.

దీనికి ప్రధాన కారణం అప్పట్లో వాతావరణంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండటమేననే వాదన ఉన్నది. తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తాజాగా తమకు లభించిన ఆధారాలను బట్టి ఆల్గే వంటి జీవులకు సముద్రంలో సరిపడా తిండి ఉండటం వల్లే భూమిపైకి రాలేదంటున్నా రు. సహారా ఎడారిలో గులాబీ వర్ణద్రవ్యం దొరికిన నల్లటి సముద్ర నాపరాళ్లను పొడిగా చేసినప్పుడు వాటి పొరల్లో సైనోబ్యాక్టీరియాల అవశేషాలను గుర్తించామన్నారు. దీనిని బట్టి అప్పట్లో సముద్రాల్లో సైనో బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉండేదని తేల్చారు. శైవలాలు వంటి సూక్ష్మజీవులు సైనోబ్యాక్టీరియాను ఆహారంగా తీసుకుంటాయని, సముద్రాల్లో పుష్కలంగా సైనోబ్యాక్టీరియా ఉండటంతో ఆల్గేలకు భూమిపైకి రావాల్సిన అవసరం రాలేదన్నారు. 65 కోట్ల ఏండ్ల కిందట సముద్రాలు కుంచించుకుపోవడం, సైనోబ్యాక్టీరియా శాతం తగ్గిపోవడంతో ఆల్గేలు ఆహారం కోసం భూమి మీదికి చేరాయన్నారు. ఫలితంగా అవి పరిణామం చెంది 60 కోట్ల ఏండ్ల కిందట సంక్లిష్జ జీవజాతులు ఉద్భవించాయని వివరించారు.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles