ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి!

Thu,May 16, 2019 01:45 AM

Saudi Arabia says oil facility attacks target world supplies

- అంతర్జాతీయ చమురు సరఫరాను దెబ్బతీయడమే వారి లక్ష్యం
- చమురు ట్యాంకర్లు, పైప్‌లైన్‌పై దాడులను ఖండించిన సౌదీ అరేబియా క్యాబినెట్


రియాద్, మే 15: తమ దేశానికి చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లు, విదేశాలకు ముడి చమురును సరఫరాచేసే ప్రధాన పైప్‌లైన్‌పై జరిగిన డ్రోన్ దాడిని సౌదీ అరేబియా మరోసారి ఖండించింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా అభివర్ణించింది. సౌదీకి చెందిన నాలుగు ముడిచమురును ఎగుమతి చేసే నౌకలపై ఆదివారం, సౌదీ నుంచి విదేశాలకు చమురును సరఫరాచేసే ఓ ప్రధాన పైప్‌లైన్‌పై మంగళవారం దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పైప్‌లైన్‌ను సౌదీ తాత్కాలికంగా మూసివేసింది. మంగళవారం సాయంత్రం సౌదీ రాజు బిన్ సల్మాన్ నేతృత్వంలో జెడ్డా నగరంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇవి తమ దేశంపై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రపంచ చమురు భద్రతపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.

ఉగ్రవాదులు సౌదీకి చెందిన చమురు నిల్వలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలేదు. ప్రపంచ ముడిచమురు సరఫరా భద్రతను ప్రశ్నార్థకం చేశారు. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రిమండలి భావిస్తున్నది అని వెల్లడించారు. ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. మంగళవారం ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై జరిగిన దాడికి యెమెనీ హుథీ తిరుగుబాటుదారుల బృందం బాధ్యత వహించింది. సౌదీ అరేబియా తన మిత్రదేశాలతో కలిసి గత నాలుగేండ్లుగా చేసిన యుద్ధనేరాలకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు తెలిపింది.

381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles