ఖషోగ్గి హత్య కేసుపై విచారణ ప్రారంభం

Fri,January 4, 2019 12:36 AM

Saudi Arabia Begins Trial in Khashoggi Murder

-ఐదుగురికి మరణ దండన విధించాలన్న సౌదీ అటార్నీ జనరల్
రియాద్: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో 11 మంది నిందితుల్లో ఐదుగురికి మరణ దండన విధించాలని రాయల్ న్యాయస్థానాన్ని సౌదీ అరేబియా అటార్నీ జనరల్ కోరారు. గురువారం ఖషోగ్గి హత్య కేసుపై రియాద్‌లోని కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు 11 మంది నిందితులు హాజరయ్యారు. ఇస్తాంబుల్‌లోని తమ దౌత్య కార్యాలయంలో జరిగిన ఖషోగ్గి హత్య కేసుపై సాక్ష్యాధారాలను అందజేయాలని రెండుసార్లు టర్కీని కోరినా అటువైపు నుంచి ప్రతిస్పందన రాలేదని అటార్నీ జనరల్ తెలిపారు.

344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles