HomeInternational News

సాదిక్‌ఖాన్ లండన్‌కు పెద్ద విపత్తు

Published: Mon,June 17, 2019 12:29 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-కొత్త మేయర్ అవసరం
-ట్విట్టర్‌లో ట్రంప్ విమర్శ

లండన్, జూన్ 16: లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. ఆయనను బ్రిటన్‌కు జాతీయ విపత్తుగా అభివర్ణించారు. లండన్‌లో జరుగుతున్న వరుస నేర ఘటనలపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ.. మేయర్ సాదిక్‌ఖాన్ లండన్ నగరాన్ని నాశనం చేస్తున్నారని, లండన్‌కు కొత్త మేయర్ అవసరం అని ట్వీట్ చేశారు. నగరంలో హింసకు తావులేదని, లండన్ వాసుల రక్షణ కంటే తనకు మరేదీ ప్రాధాన్యం కాదంటూ సాదిక్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మేయర్ సాదిక్‌ఖాన్ బాధితులకు అండగా ఉన్నారని ఆయన అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. వీరి మధ్య ట్విట్టర్ వార్ గత కొన్నేండ్లుగా కొనసాగుతున్నది. వలసదారుల పట్ల ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తూ 20వ శతాబ్దపు నియంతగా సాదిక్‌ఖాన్ గతంలో ఆరోపించారు.

258

More News