ఐఎస్ అధిపతి బగ్దాదీ హతం?

Sat,June 17, 2017 02:56 AM

రష్యా వెల్లడి.. ఆధారాలు లేవన్న అమెరికా

bagdhadi
మాస్కో: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అధిపతి అబూ బక్ అల్-బగ్దాదీ హతమయ్యాడా? లేదా? అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత నెల 28వ తేదీన సిరియాలోని రఖ్వాలో జరిపిన వైమానిక దాడుల్లో బగ్దాదీ హతమయ్యాడని రష్యా శుక్రవారం తెలిపింది. బగ్దాదీ మృతిపై విభిన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తాము కూడా పరిశీలన చేస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రో తెలిపారు. మరోవైపు బగ్దాదీ బతికే ఉన్నట్లు త్వరలో ఓ సమాచారాన్ని కూడా బహిర్గతం చేస్తారని ఐఎస్ సానుభూతిపరులు అంటున్నారు. బగ్దాదీ హతమైనట్లు సమాచారమేదీ లేదని అమెరికా తెలిపింది. 2015లో బగ్దాదీ తీవ్రంగా గాయపడ్డాడని, కోలుకున్న తర్వాత తిరిగి చురుగ్గా పాల్గొన్నాడని పేర్కొన్నది.

478

More News

మరిన్ని వార్తలు...