బెంగళూరులో త్వరలో రోబో రెస్టారెంట్లు ప్రారంభం

Mon,August 19, 2019 03:23 AM

Robot Restaurant comes to Bengaluru

బెంగళూరు, ఆగస్టు18: బెంగళూరులో త్వరలో రోబో రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే చెన్నై, కోయంబత్తూరులో రోబో రెస్టారెంట్లు విజయవంతం కావడంతో త్వరలో బెంగళూరులోనూ ప్రారంభించనున్నారు. ఇక్కడ వినియోగదారులకు రోబోలే ఆహారపదార్థాలను వడ్డించనున్నాయి. బెంగళూరులోని ఇంద్రానగర్ హైస్ట్రీట్‌లో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటుచేయనున్నారు. మెనూలో ఎక్కువగా ఇండియా ఆసియా వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. రెస్టారెంట్‌లో ఆరుగురు రోబోల బృందం ఉంటుంది. వినియోగదారులు తమ టేబుల్ మీద ఉంచిన ట్యాబ్‌ల ద్వారా రోబోలను పిలిచి సేవలు చేయించుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలు, పుట్టినరోజు వేడుకల్లో రోబోలు వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపేలా వాటిలో ప్రోగ్రామ్‌ను అమర్చారు. బెంగళూరు ప్రజలు రోబోట్ రెస్టారెంట్లను ఆదరిస్తారన్న నమ్మకం తమకు ఉన్నదని రోబో రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు వెంకటేశ్ రాజేంద్రన్ తెలిపారు.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles