ఆసియాన్‌లో ఆకట్టుకున్న రామాయణం


Tue,November 14, 2017 01:41 AM

ramayan-zee
మనీలా: ఆసియా సదస్సు ప్రారంభ కార్యక్రమంలో రామాయణంపై సంగీత ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది. రెండు రోజుల ఆసియాన్ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆసియాన్ భాగస్వామ్య దేశాలకు చెందిన నాయకులు, ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా ప్రధాని లీ కేకియాంగ్, జపాన్ ప్రధాని షింజో అబే తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయణంపై సంగీత ప్రదర్శన నిర్వహించారు. భారత్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను ఈ ప్రదర్శన ప్రతిబింబించింది. ప్రదర్శన ఆద్యంతం అద్భుతంగా సాగటంతో సదస్సుకు హాజరైన ప్రతినిధులతోపాటు ప్రపంచ నేతలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఫిలిప్పీన్స్‌లో రామయణాన్ని మహారాడియా లావణ అని అంటారు. అనగా మహారాజు రావణుడు అని అర్థం.

179

More News

VIRAL NEWS