భారత్‌ను నడిపేది వారసత్వమే


Wed,September 13, 2017 02:48 AM

-కాలిఫోర్నియా వర్సిటీ విద్యార్థులతో రాహుల్
-మోదీ పాలనపై తీవ్ర విమర్శలు

rahul
వాషింగ్టన్, సెప్టెంబర్ 12: వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామా అనే ప్రచారాన్ని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తిరస్కరించారు. అంతటా వారసత్వమే రాజ్యమేలుతున్నదని, అయితే వారసత్వం కన్నా సామర్థ్యం ముఖ్యమని ఆయన నొక్కిచెప్పారు. అమెరికాలోని బర్కిలీ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. ప్రధాని యథేచ్ఛగా ప్రమాదకరమైన రీతిలో చేపట్టిన నోట్లరద్దు, జీఎస్టీ అమలులో తొందరపాటు వల్ల భారత ఆర్థికరంగానికి భారీనష్టం వాటిల్లిందని రాహుల్ ధ్వజమెత్తారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో పరోక్షంగా ప్రస్తావించారు. విచ్ఛిన్నకర రాజకీయాల విషపునీడలు దేశంలో పరుచుకుంటున్నాయని, ఉదారవాద జర్నలిస్టులను కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అనాసక్తితో రాజకీయాల్లో కొనసాగుతున్నాననేది అవతలి రాజకీయ శిబిరం నడుపుతున్న వ్యతిరేక ప్రచారం ఫలితమని చెప్పారు. రాహుల్‌గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్‌కు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతల విమర్శలు అసహనాన్ని చాటుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు ఆనందశర్మ ఆరోపించారు.

570

More News

VIRAL NEWS