రఘునందన్‌కు మరణశిక్ష వాయిదా పడొచ్చు

Sat,January 13, 2018 01:09 AM

Raghunandan may be sentenced to death

పెన్సిల్వేనియా గవర్నర్ సానుకూలంగా ఉన్నారన్న అధికార వర్గాలు
వాషింగ్టన్, జనవరి 12: ఓ వృద్ధురాలు, ఆమె మనుమరాలిని కిరాతకంగా హత్య చేసిన కేసులో మరణదండనకు గురైన ప్రవాస భారతీయుడు రఘునందన్ యండమూరికి వచ్చే నెల 23న శిక్షను అమలు చేసే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి. మరణశిక్షలపై 2015లో పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వుల్ఫ్ జారీ చేసిన మారిటోరియం(నిలుపుదల) కారణంగానే రఘునందన్‌కు శిక్షను అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొన్నాయి. 2012లో డబ్బు కోసం సాన్వీ అనే 14నెలల పాపను రఘునందన్ కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో తనకు అడ్డు వచ్చిన పాప నాయనమ్మ వెన్న సత్యవతి (61)ని హత్య చేశాడు. పాపను సూట్‌కేసులో బంధించడంతో ఊపిరాడక మృతిచెందింది. దీంతో రఘునందన్‌కు పెన్సిల్వేనియా కోర్టు 2014లో మరణశిక్ష విధించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్ కమ్యూనికేషన్ డైరెక్టర్ సుయీమెక్‌నాగ్టన్ మాట్లాడుతూ రఘునందన్‌కు మరణశిక్ష అమలుపై పెన్సిల్వేనియా కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోతే తన అధికారాలను ఉపయోగించి ఈ శిక్షను వాయిదా వేస్తానని గవర్నర్ టామ్ వుల్ఫ్ చెప్పారని పేర్కొన్నారు. అయితే వచ్చే నెల 23న రఘునందన్‌కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలు చేయాలని గతవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరక్షన్ నిర్ణయించింది.

281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles