మెక్సికో గోడ.. నమూనా ఇలా..


Fri,October 13, 2017 10:16 AM

mexicowall
శాన్‌డిగో, అక్టోబర్ 6 : అమెరికా దక్షిణ సరిహద్దులో మెక్సికో వెంబడి గోడ నిర్మించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు శాన్‌డిగోలో పనులు ప్రారంభమయ్యాయి. 30 అడుగుల ఎత్తున ఆధునిక నిర్మాణ ప్రమాణాలతో ఈ గోడను కట్టబోతున్నారు. గోడ నిర్మాణానికి సంబంధించిన ఎనిమిది రకాల మోడళ్లను కాంట్రాక్టర్లు శాన్‌డిగోలో పిల్లర్లపై నిలబెట్టారు. వీటిలో నాలుగు స్టీల్‌వి కాగా, నాలుగు కాంక్రీట్‌వి. అమెరికా కస్టమ్స్, సరిహద్దు భద్రతా విభాగం ఎంపిక చేసిన మోడల్ తరహాలో గోడ నిర్మాణం జరుగనుంది. వలసలు, స్మగ్లింగ్ నిరోధానికి మెక్సికో సరిహద్దు వెంబడి 3200 కిలోమీటర్ల పొడవునా గోడను నిర్మిస్తామని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చారు. ఆమేరకు ఈ ఏడాది జనవరి 25న గోడ నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తడంతో నిర్మాణం ఆలస్యంగా మొదలైంది. గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చును మెక్సికో భరిస్తుందని ట్రంప్ చెబుతుండగా, తమకేమీ సంబంధం లేదని మెక్సికో అధికారులు స్పష్టంచేస్తున్నారు.
US-Mexico-border
usmexicomap

1323

More News

VIRAL NEWS