ట్రంప్.. నోరు తెరిస్తే అబద్ధాలే

Wed,January 23, 2019 01:21 AM

-జనాన్ని తప్పుదోవ పట్టించడంలో ఘనాపాటి
-రోజుకు సగటున 16.5 అబద్ధాలు.. గత రెండేండ్లలో 8,158
-వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడి

వాషింగ్టన్: ప్రపంచ దేశాలకు సుద్ధులు చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అబద్ధాలు చెప్పి జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడంలో ఘనాపాటిగా పేరొందారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన 8 వేలకుపైగా అబద్ధాలు చెప్పినట్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఆదివారం రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మరునాడే ఈ వివరాలు వెలుగు చూడడం గమనార్హం. తొలి ఏడాది రోజుకు సగటున దాదాపు 5.9 తప్పుడు వ్యాఖ్యలు, ప్రకటనలు చేసిన ట్రంప్.. రెండో ఏడాదిలో రోజుకు సగటున దాదాపు 16.5 తప్పుడు వ్యాఖ్యలు, ప్రకటనలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ వివరించింది. ట్రంప్ నోటి నుంచి జాలువారే ప్రతి అనుమానాస్పద ప్రకటనను లోతుగా విశ్లేషించి క్యాటగిరీలుగా విభజించే ఫ్యాక్ట్ చెకర్స్ సమాచార కేంద్ర గణాంకాలను ఆ పత్రిక ఉటంకించింది. ఫ్యాక్ట్ చెకర్స్ డేటాబేస్ గణాంకాల ప్రకారం గత రెండేండ్లలో ట్రంప్ 8,158 అబద్ధాలు, జనాన్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడారని, వీటిలో రెండో ఏడాదే 6 వేలకుపైగా ఉన్నాయని, అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ట్రంప్ 492 అబద్ధాలు మాట్లాడారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.

775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles