ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సిద్ధం


Sat,August 12, 2017 01:37 AM

-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్, ఆగస్టు 11: అమెరికాపై క్షిపణిదాడులు చేస్తామని బెదిరిస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్యకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ దేశం గనుక తెలివితక్కువగా వ్యవహరిస్తే చర్య తప్పదని హెచ్చరించారు. ప్రపంచాన్ని అణువిముక్తం చేయాలని అనుకొంటున్నానని చెప్పారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని బెడ్‌మినిస్టర్ ప్రాంతంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచానికి భూతాపమే మహా ఉపద్రవమన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయంతో ఏకీభవించనని, అణ్వాయుధాలు అంతకన్నా పెనుముప్పు అని తెలిపారు. ఈ ముప్పు తొలిగిపోవాలంటే అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్‌తోపాటు అన్ని దేశాలు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను నిర్మూలించాలన్నారు. 755 మంది దౌత్యసిబ్బందిని రష్యా వెనకకు పంపడం వల్ల వేతనాల బిల్లు తగ్గి తమకు మేలే జరిగిందని, ఇందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.

531

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS