మోదీకి గేట్స్ ఫౌండేషన్ అవార్డు

Wed,September 4, 2019 01:11 AM

-స్వచ్ఛ భారత్ కృషికి గ్లోబల్ గోల్‌కీపర్ పురస్కారం
న్యూయార్క్: ప్రధాని మోదీని మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఆయనకు గ్లోబల్ గోల్‌కీపర్ పురస్కారం ప్రదానం చేయనున్నది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం మోదీ చేసిన కృషికిగాను ఈ అవార్డుతో సత్కరించనున్నది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో గేట్స్ ఫౌండేషన్ నిర్వహించనున్న గోల్‌కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డ్స్ నాల్గవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. సార్వత్రిక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2014 అక్టోబర్ 2న జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీజీ 150వ జయంతికి నివాళిగా స్వచ్ఛ భారత్‌తోపాటు బహిరంగ మలవిసర్జనను సంపూర్ణంగా నివారించే పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఇం దులో భాగంగా దేశంలోని 98శాతం గ్రామా ల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

566
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles