షాద్‌మన్ చౌక్‌కు భగత్‌సింగ్ పేరు పెట్టాలి

Fri,February 23, 2018 12:13 AM

Plea In Pak Court For Renaming Roundabout In Lahore After Bhagat Singh

-పాకిస్థాన్ కోర్టులో పిటిషన్
లాహోర్: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన ప్రదేశానికి ఆయన పేరు పెట్టాలని, అక్కడ భగత్‌సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ పాకిస్థాన్‌లోని లాహోర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి దాఖలు చేశారు. ఈ విషయమై గతంలోను పిటిషన్ దాఖలైందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ రెండు పిటిషన్‌లను జతచేయాలని, వీటిపై వచ్చేనెల 5న విచారణ జరుపుతామని తెలిపారు.

327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles