భార్యను చంపిన భారతీయ ‘గే’

Thu,December 6, 2018 03:06 AM

Pharmacist jailed for murdering wife to start new life with boyfriend

-బ్రిటన్‌లో యావజ్జీవం
-ప్రియుడితో ఆస్ట్రేలియాలో స్థిరపడటానికే ఈ కుట్ర

లండన్: స్వలింగ సంపర్కుడైన ఓ వ్యక్తి ప్రియుడి కోసం భార్యను హత్య చేశాడు. ఆమె పేరుపై వచ్చే రెండు మిలియన్ పౌండ్ల బీమా డబ్బులతో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అస్ట్రేలియాలో స్థిరపడాలనుకున్నాడు. చివరికి కేసు రుజువు కావడంతో కోర్టు అతడికి యావజ్జీవఖైదు విధించింది. ఈ ఘట న బ్రిటన్‌లో ఇటీవల జరుగగా బుధవారం కోర్టు తీర్పునిచ్చింది. భారత సంతతి వ్యక్తి మితేశ్ పటేల్ భార్య, జస్సికా పటేల్‌తో కలిసి బ్రిటన్‌లో జీవిస్తున్నాడు. స్వలింగసంపర్కుడైన అతడు ఒక వ్యక్తి ప్రేమలో పట్టాడు. దీంతో భార్యను అడ్డు తొలిగించుకునేందుకు మోతాదుకు మించి ఇన్సులిన్ ఇచ్చాడు. తర్వాత ఆమెను పెద్ద ప్లాస్టిక్ సంచిలో కుక్కడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలింది. తన భార్య దోపిడీ దొంగల చేతుల్లో హత్యకు గురైనట్లు కథ అల్లాడు. అనుమానంతో పోలీసులు విచారించగా నేరం బయటపడింది. బుధవారం ట్రీసైడ్ క్రౌన్ కోర్టు మితేశ్ పటేల్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. జస్సికా పటేల్ సోదరి దివ్య మాట్లాడుతూ మా సోదరిని హత్య చేసే హక్కు నీకు(మితేశ్ పటేల్) ఎవరిచ్చారు. కావాలంటే విడాకులు తీసుకుంటే సరిపోయేది. కానీ ఆమెను తిరిగి రాని లోకాలకు పంపావు అని తీవ్ర భావోద్వేగంతో పేర్కొన్నారు.

420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS