హాంకాంగ్‌లో ఆగని ఆందోళనలు

Mon,August 19, 2019 03:21 AM

peaceful-march-of-1-7-million-in-hong-kong

భారీవర్షంలో సైతం నిరసనకారుల శాంతియుత ప్రదర్శనలు
హాంకాంగ్, ఆగస్టు 18: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమకారుల నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. నేరస్థుల అప్పగింత బిల్లుపై హాంకాంగ్ పది వారాలుగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. హాంకాంగ్ ఆందోళనలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనలను విరమించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయినప్పటికీ, నిరసనకారులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఆదివారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, గొడుగులు పట్టుకొని శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు. విక్టోరియా పార్కు నుంచి మొదలైన నిరసనలకు సివిల్ హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ నేతృత్వం వహించింది. హాంకాంగ్‌లో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికే ఈ ఆందోళనలు చేపడుతున్నామని పేర్కొన్నది. తమ నిరసనలు హేతుబద్ధమైనవని, అహింసతో కూడుకున్నవని ఫ్రంట్ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం హాంకాంగ్ విమానాశ్రయాన్ని దిగ్బంధించిన నిరసనకారులు.. తమ ఆందోళనలను క్రమంగా తీవ్రతరం చేస్తున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా శనివారం నిర్వహించిన ఆందోళనలో వేలమంది నిరసనకారులు పాల్గొన్నారు.

313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles