అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారం


Tue,April 17, 2018 08:14 AM

భారత్‌తో సత్సంబంధాలపై పాక్ ఆర్మీ చీఫ్ వెల్లడి
pak-army-chief-bajwa
ఇస్లామాబాద్: భారత్‌తో ఉన్న విభేదాలను, సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలే ఏకైక మార్గమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా చెప్పారు. సమగ్ర, అర్థవంతమైన చర్చల ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, కశ్మీర్‌కు కూడా అదే మార్గమని అన్నారు. శనివారం కకూల్‌లో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని పాకిస్థాన్ కోరుకుంటున్నదని, ప్రధానంగా తన పొరుగుదేశాలతో ఇంకా మెరుగైన సంబంధాలను ఆశిస్తున్నదని చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో పాక్ ప్రభుత్వం, సైన్యం ఐక్యంగా ఉన్నాయని, తమ చర్యల వల్ల పాక్‌గడ్డపై ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు.

269

More News

VIRAL NEWS