పారిస్‌లో పేలుడు.. ముగ్గురి మృతి

Sun,January 13, 2019 01:54 AM

Paris bakery gas explosion kills three

-47 మందికి గాయాలు..10 మంది పరిస్థితి విషమం
-గ్యాస్ లీకవడంతో దుర్ఘటన

పారిస్, జనవరి 12: సెంట్రల్ పారిస్‌లోని ఓ భవనంలో శనివారం పేలుడు సంభవించడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది కాగా, ఒకరు స్పేయిన్ పర్యాటకురాలు ఉన్నారు. 47 మంది గాయపడగా.. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. బేకరీ, రెస్టారెంట్ ఉన్న ఈ భవనంలో మొదట గ్యాస్ లీకు కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. పేలుడు ధాటికి భవనంతో పాటు చుట్టుపక్కల ఉన్న నివాస సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించింది. అక్కడ పార్కింగ్ చేసిన కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని దవాఖానలో చేర్పించారు.

799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles