పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..20 మంది మృతి

Thu,July 12, 2018 12:48 AM

Pakistani politician among 20 killed in Taliban suicide blast at poll rally

-ప్రాణాలు కోల్పోయిన ఏఎన్‌పీ నాయకుడు హరూర్ బిలౌర్
పెషావర్, జూలై 11: పాకిస్థాన్‌లో జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతిచెందారు. 66 మంది గాయపడ్డారు. మృతుల్లో అవామీ నేషనల్ పార్టీ(ఏఎన్‌పీ) సీనియర్ నాయకుడు హరూన్ బిలౌర్ ఉన్నారు. ఈనెల 25న పాకిస్థాన్ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని పెషావర్ నగరంలో ఏఎన్‌పీ మంగళవారం అర్థరాత్రి ఎన్నికల సభను నిర్వహించింది. సభ లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాది ఒకడు తనను తాను పేల్చుకోవడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హరూన్ బిలౌర్ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడి జరుపడం ఇది రెండోసారి. పోలీసులు మాట్లాడుతూ హరూన్ బిలౌర్ లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని చెప్పారు.

332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS