పాకిస్థాన్‌లో కొత్తగా దక్షిణ పంజాబ్ రాష్ట్రం!

Thu,May 16, 2019 01:14 AM

Pakistan to bifurcate Punjab to create new province Qureshi

లాహోర్, మే 15: పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ర్టాన్ని విభజించి దక్షిణ పంజాబ్ రాష్ర్టాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషి చెప్పారు. ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా పంజాబ్ రాష్ర్టాన్ని విడదీసి దక్షిణ పంజాబ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. దక్షిణ పంజాబ్ రాష్ట్రంలో ముల్తాన్, బవల్‌పూర్, దేరా ఘాజీ ఖాన్ జిల్లాలు ఉండనున్నాయని వివరించారు.

226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles