పాక్ సెనేటర్‌గా కృష్ణకుమారి ప్రమాణం

Tue,March 13, 2018 05:44 AM

Pakistan swears in new senators including Hindu woman Krishna Kumari

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సెనేటర్‌గా హిందూ దళిత మహిళ కృష్ణకుమారి కోల్హి (39) సోమవారం ప్రమాణం చేశారు. సెనేట్‌కు ఎన్నికైన 51 మంది సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు. ఆమెతో ప్రిసైడింగ్ ఆఫీసర్ సర్దార్ యాకూబ్ ఖాన్ నాసర్ ప్రమాణం చేయించారు. పాక్ సెనేట్‌కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా కోల్హి చరిత్ర సృష్టించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున సింధ్ ప్రావిన్స్ నుంచి సెనేటర్‌గా గెలుపొందారు.

393

More News

VIRAL NEWS