షరీఫ్‌పై జీవితకాల నిషేధం

Sat,April 14, 2018 03:25 AM

Pakistan Supreme Court Historic Judgment

-పాకిస్థాన్ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
ఇస్లామాబాద్: అవినీతి ఆరోపణలతో అనర్హత వేటుకు గురైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని పాక్ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఉమర్ అటా బండియా ల్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో షరీఫ్ రాజకీయ భవితవ్యానికి ముగింపు పలుకుతూ పాక్ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని 62 (1) (ఎఫ్) అధికరణం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు పడితే అది ఇక నుంచి జీవితకాలం పాటు అమలులో ఉంటుందని జస్టిస్ బండియాల్ పేర్కొన్నారు. 62వ అధికరణం ప్రకారం ఎంపీ నిజాయితీగా, నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. దీని వల్లే పనామా పత్రాల కేసులో షరీఫ్ గత ఏడాది జూలై 28న అనర్హత వేటుకు గురై ప్రధాని పదవిని కోల్పోయారు.

425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS