మానవ హక్కుల కార్యకర్త అస్మా కన్నుమూత

Mon,February 12, 2018 02:16 AM

Pakistan s human right activist Asma Jahangir passes away

-గుండెపోటుతో మృతిచెందిన సామాజిక కార్యకర్త
-పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాపాడటానికి జీవితాన్ని ధారబోసిన న్యాయవాది

asma-jahangir
లాహోర్: పాకిస్థాన్ ప్రముఖ సామాజిక కార్యకర్త, మానవ హక్కులకోసం పోరాడుతున్న న్యాయవాది అస్మా జహంగీర్(66) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. ఆదివారం ఉదయం అస్మాకు గుండెపోటు వ చ్చిందని, దీంతో వెంటనే లాహోర్‌లోని ఓ దవాఖాన కు తీసుకెళ్లామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి డాక్టర్లు తీవ్రంగా కృషిచేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె మరణవార్త తెలియగానే పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పాక్ అధ్యక్షుడు మామ్నూన్ హుస్సేన్ మాట్లాడుతూ న్యాయాన్ని బతికించడానికి అస్మా ఎంతో కృషి చేశారని కొనియాడారు.

పాక్ ప్రధాని అబ్బాసీ మాట్లాడుతూ దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయిందని చెప్పారు. హింసపై ఆమె పోరాటం వెలకట్టలేనిదన్నారు. సంతాపం తెలిపిన వారి లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో-చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ఉన్నారు. 1952లో లాహోర్‌లో జన్మించిన ఆమె పాకిస్థాన్ మానవ హక్కు ల కమిషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. దానికి చైర్మన్‌గానూ పనిచేశారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సేవలందించారు. ప్రధానంగా మానవ హక్కుల పరిరక్షణకు ఎనలేని కృషి చేశారు. పాక్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు1983లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. పాక్‌లో ముషారఫ్ సైనిక పాలన కొనసాగిన కాలం (2007)లో ఆమెను అరెస్టు చేశారు. ప్రజాస్వా మ్యం, మానవ హక్కుల రక్షణకు ఎనలేని కృషి చేసిన అస్మాని పలు అవార్డులు కూడా వరించాయి. 2014లో రైట్ లైవ్‌లీహుడ్, 2010లో ఫ్రీడమ్ అవార్డులు అందులో ఉన్నాయి.

321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS