థార్ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకున్న పాకిస్థాన్!

Sat,August 10, 2019 01:08 AM

Pakistan railway ministry says Friday midnight train to Karachi will be last

ఇస్లామాబాద్: సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలను నిలిపివేసిన పాకిస్థాన్ తాజాగా థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలపై సైతం వేటు వేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆఖరి సర్వీసు నడుస్తుందని ఆయన తెలిపారు. భారత్, పాకిస్థాన్‌ను అనుసంధానం చేస్తూ రాజస్థాన్ సరిహద్దుల గుండా ఈ సర్వీసు నడుస్తున్నది. భారత్‌లోని జోధ్‌పూర్ భగత్ కీ కోఠి స్టేషన్ నుంచి పాక్‌లోని కరాచీ వరకూ వెళ్లే ఈ రైలు ప్రతీ శుక్రవారం రాత్రి జోధ్‌పూర్ బయలుదేరుతుంది. శనివారం ఉదయం 7గంటలకు రాజస్థాన్ సరిహద్దులోని బర్మార్‌కు చేరుకుంటుంది. అయితే, పాక్ తాజా నిర్ణయంతో బర్మార్ తర్వాత థార్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు నడవడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌కి రావాలనుకునే పాక్‌లోని హిందువులు ఎక్కువగా ఈ రైలులో ప్రయాణిస్తారు. 13 ఏండ్లలో నాలుగు లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు గురించి పాక్ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని జోధ్‌పూర్ డివిజన్ ప్రతినిధి తెలిపారు.

305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles