హోటల్ వద్దు.. ఎంబసీలో ఉంటా!

Tue,July 9, 2019 02:36 AM

Pakistan PM Imran Khan wants to avoid expensive hotels during his US trip to reduce cost

-అమెరికా పర్యటన కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పొదుపు చర్యలు
-అమెరికా భద్రతా సంస్థలకు ఇబ్బందికరం

ఇస్లామాబాద్: ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే అమెరికా పర్యటనలో హోటల్‌లో బస చేయరాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయించుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా పర్యటన సమయంలో వాషింగ్టన్‌లోని పాక్ రాయబారి అధికారిక నివాసంలోనే బస చేయాలని ఇమ్రాన్‌ఖాన్ సంకల్పించారని పాకిస్థాన్‌కు చెందిన డాన్ దినపత్రిక తెలిపింది. వాషింగ్టన్‌లో పాక్ రాయబారి కార్యాలయంలో బస చేయడంతో వ్యయం తగ్గించుకోవచ్చునని ఇమ్రాన్ భావిస్తున్నట్లు డాన్ పేర్కొంది. పాక్ రాయబార కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే సుమారు 12 దేశాల ఎంబసీలు ఉన్నాయి. పాక్ ఎంబసీలో బస చేయాలన్న ఇమ్రాన్ యోచనపై అమెరికా భద్రతాసంస్థలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

1131
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles