హఫీజ్ బావమరిది అరెస్ట్

Thu,May 16, 2019 01:53 AM

pakistan mumbai attack india most wanted and hafeez saeed brother in law abdul rehman makki arrested in pakistan

- ద్వేషపూరిత వ్యాఖ్యలే కారణం

లాహోర్, మే 15: నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జుద్) అధినేత, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది హఫీజ్ అబ్దుర్ రెహ్మాన్ మక్కీని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్‌చేశారు. పాక్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోపాటు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు మక్కీని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మక్కీ అరెస్ట్‌ను పంజాబ్ పోలీసు అధికార ప్రతినిధి నాబిలా ఘజాన్‌ఫర్ ధ్రువీకరించారు. అయితే మక్కీపై మోపిన అభియోగాలేమిటో వెల్లడించలేదు. నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చేపట్టిన దాడుల్లో భాగంగా మక్కీని అరెస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. జమాత్ ఉద్ దవా రాజకీయ విభాగంతోపాటు అంతర్జాతీయ విభాగం అధిపతిగా, దాని చారిటీ సంస్థ ఫలాహ్ ఏ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్) ఇన్‌చార్జీగా మక్కీ వ్యవహరిస్తున్నారు. లాహర్‌కు 80 కి.మీ. దూరంలోని గుజ్రన్‌వాలా నగరంలో జరిగిన సభలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకే మక్కీని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జుద్, దాని అనుబంధ ఎఫ్‌ఐఎఫ్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.

218
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles