జాదవ్‌కు భారత దౌత్యవేత్తలను కలిసే అవకాశం: పాక్

Sat,July 20, 2019 01:03 AM

Pakistan grants consular access to Kulbhushan Jadhav

ఇస్లామాబాద్: తమ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ భారత దౌత్యాధికారులతో సంప్రదింపులు జరుపుకోవడానికి అనుమతినిస్తామని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నది. అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా దౌత్య సంబంధాలపై వియన్నా సదస్సు తీర్మానంలోని 36వ అధికరణం, పేరాగ్రాఫ్ 1(బీ) ప్రకారం కుల్‌భూషణ్ జాదవ్‌కు గల హక్కులపై ఆయనకు సమాచారం ఇచ్చాం అని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జాదవ్ భారత దౌత్యాధికారులతో సంప్రదింపులు జరుపుకొనేందుకు బాధ్యతాయుతమైన దేశంగా పాకిస్థాన్ అనుమతినిస్తుంది అని వివరించింది.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles