పరిణామాలు ఎలా ఉన్నా సత్యమే మాట్లాడుతా!

Tue,May 15, 2018 01:51 AM

Pakistan ex PM Nawaz Sharif slammed for Mumbai attack comments

-పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్
-ముంబై దాడి వ్యాఖ్యలకు సమర్థన

ఇస్లామాబాద్: పరిణామాలు ఎలా ఉంటాయనేదానితో సంబంధం లేకుండా తాను సత్యమే మాట్లాడుతానని పాకిస్థాన్ పదవీచ్యుత ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సోమవారం పేర్కొన్నారు. 2008లో జరిగిన 26/11 ముంబై దాడులు చేసింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. షరీఫ్ మొదటిసారిగా పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా షరీఫ్ వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో తీవ్ర వివాదానికి దారితీశాయి. కాగా దీనిపై పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి.. షరీఫ్ వ్యాఖ్యలు తప్పని.. అవి తప్పుదోవపట్టించేలా ఉన్నాయని పేర్కొన్నది.
Sharif

769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS