ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై క్షమాపణ చెప్పండి

Fri,August 10, 2018 02:52 AM

Pakistan election commission summons Imran Khan for violating code

ఇమ్రాన్‌ఖాన్‌కు పాక్ ఎన్నికల సంఘం ఆదేశం
ఇస్లామాబాద్: గత నెల 25వ తేదీన జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని కాబోయే ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను పాకిస్థాన్ ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. పోలింగ్ సందర్భంగా ఇస్లామాబాద్ నియోజకవర్గ పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఇమ్రాన్‌ఖాన్.. తెరచాటుకు వెళ్లి ఓటు వేయకుండా బహిరంగంగా మీడియా సమక్షంలో బ్యాలెట్ పేపర్‌పై తన ఓటు వేశారు. దీనిని మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇమ్రాన్‌ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎన్నికల సంఘం.. తాజాగా అతనికి వ్యతిరేకంగా దాఖలైన కేసుపై విచారణ చేపట్టింది. ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. ఇమ్రాన్‌ఖాన్ ఉద్దేశపూర్వకంగా ఆ పనిచేయలేదని పేర్కొన్నారు. ఈ వాదనతో విభేదించిన కమిషన్.. ఇమ్రాన్‌ఖాన్ క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS