హఫీజ్ పార్టీ నమోదు దరఖాస్తుకు పాక్ ఎన్నికల సంఘం నో

Thu,October 12, 2017 01:01 AM

Pakistan EC rejects JuD linked political partys registration application

ఇస్లామాబాద్/ లాహోర్: ముంబై దాడుల సూత్రధారి జమాత్ ఉద్ దువా అధిపతి హఫీజ్ సయీద్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న మిల్లీ ముస్లింలీగ్ పార్టీ నమోదుకు దాఖలైన దరఖాస్తును పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆంతరంగిక వ్యవహారాలశాఖ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవా లని బుధవారం సూచించింది. కాగా హఫీజ్‌పై ఆధారాలు సమర్పించకుంటే ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పిస్తామని పాక్ ప్రభుత్వాన్ని లాహోర్ హైకోర్టు హెచ్చరించింది. గత జనవరి 31 నుంచి హఫీజ్ సయీద్ తోపాటు గృహ నిర్బంధంలో ఉన్న మరో నలుగురికి సంబంధించిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని పాక్ ఆంతరంగిక వ్యవహారాలశాఖ కార్యదర్శిని ఇంతకుముందే లాహోర్ హైకోర్టు ఆదేశించింది. కానీ మంగళవారం జరిగిన విచారణకు ఆంతరంగికవ్యవహారాలశాఖ కార్యదర్శి గైర్హాజరు కావడంతో న్యాయస్థానం ఆగ్రహించింది. కేవలం మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ఆధారంగా పౌరులపై నిర్బంధం విధించబోమని జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ తెలిపారు.

217

More News

VIRAL NEWS