వినోదం బంద్!

Sat,August 10, 2019 01:09 AM

Pakistan bans all cultural exchanges with India

-భారత సాంస్కృతిక, వినోద కార్యక్రమాలపై పాక్ నిషేధం
ఇస్లామాబాద్: భారత్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచేసుకున్న పాకిస్థాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. వినోదరంగానికి చెందిన అన్ని రకాల సాంస్కృతిక మార్పిడిలు, కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్టు నిర్ణయించింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ భారత్‌తో సంబంధాలను తెంచుకుంటూపోతున్నది. ఇందులో భాగంగా, వినోద రంగంలో ఇరుదేశాలకు చెందిన ఉమ్మడి వ్యాపారాలను బహిష్కరిస్తున్నట్టు పాక్ ప్రధాని ప్రత్యేక సహాయకురాలు(సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ) ఫిర్‌దౌస్ ఆషిక్ అవన్ పేర్కొన్నట్టు పాకిస్థాన్ పత్రిక డాన్ పేర్కొంది.

ఇండియాకు నో చెప్పండి(భారత్‌ను బహిష్కరించండి) పేరుతో ఓ జాతీయ నినాదాన్ని పాక్ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ గురువారం ప్రారంభించినట్టు కూడా పేర్కొంది. భారత్ నుంచి వచ్చే అన్ని రకాల కార్యక్రమాలను బహిష్కరించాలి. ఈ విషయంపై పెమ్ర (పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ) అప్రమత్తతతో ఉండాలి. అలాగే, భారత డీటీహెచ్ పరికరాలను విక్రయించే వాళ్లపై చర్యలు తీసుకోవాలని పెమ్రకు సూచిస్తున్నాం అని అవన్ అన్నారు. సాంస్కృతిక మార్పిడి కారణంగా పాకిస్థాన్ యువత మనసులు కలుషితం అవుతున్నాయని, హిందూత్వ భావజాలంపై పాక్ అన్ని విధాలుగా పోరాటం చేస్తుందని అన్నారు. ఇందుకు గానూ జాతీయ భద్రతా మండలి ఓ సమితిని ఏర్పాటు చేసిందని తెలిపారు. పాక్‌పై భారత సాంస్కృతిక దండయాత్రను ఈ పరిస్థితుల్లో అణిచివేయాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆషిక్ అవన్ విన్నవించారు.

312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles