పాక్ మదర్ థెరెసా కన్నుమూత


Fri,August 11, 2017 02:34 AM

mother
కరాచీ/ ఇస్లామాబాద్: పాకిస్థాన్ మదర్ థెరెసాగా పేరొందిన జర్మనీ సంతతి వైద్యురాలు డాక్టర్ రూథ్ క్యాతరీనా మార్థా(87) గురువారం కరాచీలోని ప్రైవేట్ దవాఖానలో మరణించారు. వయస్సు పైబడిన కారణంగా సుదీర్ఘ కాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. తొలిసారి 1960లో తన 29వ ఏట పాకిస్థాన్‌ను సందర్శించిన రూథ్ కుష్ఠు వ్యాధిగ్రస్తుల బాధలతో చలించిపోయారు. వారికి వైద్య సేవలందించేందుకు పాకిస్థాన్‌లోనే ఉండిపోయారు. 1962లో కరాచీలో మేరీ అడిలైడ్ కుష్ఠు నివారణ కేంద్రం స్థాపించారు. తర్వాత దేశంలోని అన్ని రాష్ర్టాల్లో శాఖలు ప్రారంభించి, 50 వేలకు పైగా కుటుంబాలకు వైద్యసేవలందించారు. అవిశ్రాంతంగా ఆమె అందించిన సేవలను గుర్తించి.. కుష్ఠు వ్యాధి రహిత పాక్ అని 1996లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. రూథ్ మృతి పట్ల పాక్ ప్రధాని షాహీద్ ఖాఖాన్ అబ్బాసీ సంతాపం తెలిపారు. అమె భౌతికకాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.

580

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS