పాక్ నిర్భయ కేసువారం రోజుల్లో విచారణ పూర్తి


Tue,February 13, 2018 01:17 AM

Pak-Nirbhaya
లాహోర్: మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో ప్రధాన నిందితుడే దోషి అని పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు సోమవారం నిర్ధారించింది. పంజాబ్ రాష్ట్రంలోని కసూర్‌లో ఏడేండ్ల పసిపాప జైనబ్‌ను ఆ కామాంధుడు కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించి, హత్యచేసి చెత్తకుప్పలో పడేశాడు. గత జనవరి 5న జరిగిన ఈ ఘటనపై పాక్‌లో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాక్ నిర్భయగా ఈ ఘటనను మన దేశ మీడియా అభివర్ణించింది. ఈ కేసు విచారణను ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు అప్పగించి వారం రోజుల్లోగా తేల్చాలని లాహోర్ హైకోర్టు సూచించింది. సాక్షుల విచారణ, లాయర్ల వాదనలు విన్న తరువాత నిందితుడు ఇమ్రాన్ అలీ నక్ష్‌బంది హత్యకు పాల్పడ్డట్లు జడ్జి నిర్ధారించారని జియోన్యూస్ టీవీ తెలిపింది. నిందితుడు ఇమ్రాన్ గతంలో పలువురు బాలికలపై లైంగికదాడులు జరిపి హత్యచేశాడు. బాధితుల నుంచి సేకరించిన శాంపిళ్లను, ఇమ్రాన్ డీఎన్‌ఏను పోల్చిచూడగా దాడి చేసింది అతనే అని తేలింది. పాలిగ్రాఫ్ పరీక్షలు, దుస్తులపై మరకలు, సీసీటీవీ దృశ్యాలు, వైద్య నివేదికలు కూడా ఇమ్రాన్‌ను దోషిగా నిర్ధారించాయి.

193

More News

VIRAL NEWS