అమెరికాను వీడని 21 వేల మంది భారతీయులు

Thu,August 9, 2018 02:16 AM

Over 21000 Indians overstayed visas in US last year

-గత ఏడాది వీసా గడువు ముగిసినా అక్కడే నివాసం
-హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నివేదికలో వెల్లడి

వాషింగ్టన్, ఆగస్టు 8: గత ఏడాది తమ వీసాల గడువు ముగిసినప్పటికీ 21 వేల మంది భారతీయులు అమెరికాలోనే ఉండిపోయారని హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం (డీహెచ్‌ఎస్) బుధవారం వెల్లడించింది. వీరంతా తమకు అనుమ తి ఇచ్చిన దానికంటే ఎక్కువ కాలంపాటు అమెరికాలో గడిపినట్టు తెలిపింది. అయితే వీసాల గడువు ముగిసినా అక్కడే ఉండే ఇతర దేశాల వారితో పోల్చితే భారతీయుల శాతం చాలా తక్కువ. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చి గడువు ముగిసినా అక్రమంగా అక్కడే ఉంటున్న మొదటి పది దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నదని డీహెచ్‌ఎస్ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక పేర్కొన్నది.

వివిధ వీసాలపై వచ్చిన 7,01,900 మంది విదేశీయులు 2016 అక్టోబర్ నుంచి 2017 సెప్టెంబర్ మధ్య అమెరికాలో అక్రమంగా ఉండిపోయారు. 2017లో 10.7 లక్షల మంది భారతీయులు వ్యాపారం, పర్యాటకం కోసం బీ1, బీ2 వీసాలపై అమెరికాను సందర్శించారు. వీరిలో 14,204 మంది వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాను వీడలేదు. వీరిలో వీసా గడువు ముగిసిపోయిన కొంతకాలం తర్వాత 1,708 మంది అమెరికా నుంచి వెళ్లిపోగా.. 12,498 మంది భారతీయులకు సంబంధించిన రికార్డులు లభ్యం కాలేదు. దీంతో వారు అమెరికాలోనే అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. 2017లో 1,27,435 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రాగా.. 4,400 మంది విద్యార్థులు వీసా గడువు ముగిసినా అక్కడే ఉన్నారు. వీరిలో 1567 మంది తర్వాత వెళ్లిపోగా.. 2833 మంది ఇంకా అక్కడే ఉన్నారు.

1333
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS